మే నెలలో 11 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు!

ఈ ఏడాది మే నెలలో రత్నాభరణాల ఎగుమతులు 10.70 శాతం క్షీణించి రూ. 22,693.41 కోట్లకు చేరుకున్నాయని జెమ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది.

Update: 2023-06-18 14:48 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో రత్నాభరణాల ఎగుమతులు 10.70 శాతం క్షీణించి రూ. 22,693.41 కోట్లకు చేరుకున్నాయని జెమ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో రత్నాభరణాల ఎగుమతులు రూ. 25,412 కోట్లుగా నమోదయ్యాయని జీజేఈపీసీ తన నెలవారీ డేటాలో తెలిపింది.

ఈ గణాంకాల ప్రకారం, పాలిష్ చేసిన వజ్రాల మొత్తం ఎగుమతులు 12.17 శాతం తగ్గి రూ. 1,985 కోట్లుగా ఉన్నాయి. బంగారు ఆభరణాల మొత్తం ఎగుమతులు రూ. 5,705.32 కోట్లతో 7.29 శాతం పెరిగాయి. ఇక, ఏప్రిల్-మే మధ్యకాలంలో మొత్తం వెండి ఆభరణాల ఎగుమతులు 68.54 శాతం తగ్గి రూ. 1,173.25 కోట్లకు క్షీణించాయని జీజేఈపీసీ పేర్కొంది.


Similar News