FPI: స్టాక్ మార్కెట్ల నష్టాలు.. భారీగా నిధులను వెనక్కి తీసుకున్న ఫారిన్ ఇన్వెస్టర్లు..!
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్(Global Market) నుంచి నెగటివ్ సిగ్నల్స్ అందడం, రెండో త్రైమాసికంలో దిగ్గజ కంపెనీలు లాభాలను ఆర్జించకపోవడం వంటివి మన స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ షేర్ల(Equity Shares)లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 22,420 కోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అలాగే అక్టోబర్(October)లో ఫారిన్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 94,017 కోట్లను బ్యాక్ తీసుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత నెల నుంచి పెద్ద ఎత్తున విక్రయాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఈ నెలలోనూ అదే బాటలో పయనిస్తున్నారు. కాగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) వడ్డీ రేట్లను తగ్గించడం, చైనా(China) తీసుకున్న ఉద్దీపన చర్యల వల్ల కూడా ఎఫ్‌పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.