RBI Data: వరుసగా ఐదో వారంలో రికార్డు స్థాయికి ఫారెక్స్ నిల్వలు

గడిచిన నాలుగు వారాల్లో మొత్తం 19.1 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు పెరిగాయి.

Update: 2024-09-20 18:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు సెప్టెంబర్ 13 నాటికి రికార్డు స్థాయిలో 689.46 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వరుసగా ఐదవ వారంలో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ హైని తాకాయి. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. గడిచిన నాలుగు వారాల్లో మొత్తం 19.1 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. అమెరికా డాలరుతో భారత కరెన్సీ రూపాయి మారకం క్షీణతను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ద్వారా జోక్యం చేసుకుంటోంది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 5.5 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్‌బీఐ డేటా పేర్కొంది. గత నాలుగు నెలల కాలంలో దేశీయంగా ఎఫ్‌డీఐలు 23.6 శాతం పెరిగాయి. ఈ పెట్టుబడుల్లో అత్యధికంగా తయారీ, ఆర్థిక సేవలు, కమ్యూనికేషన్ సేవలు, కంప్యూటర్ సేవలు, విద్యుత్, ఇతర ఇంధన రంగాల్లో వచ్చాయని ఆర్‌బీఐ డేటా వెల్లడించింది. 

Tags:    

Similar News