Forex Reserves: మళ్లీ పుంజుకున్న భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!

గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తున్న భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు ఎట్టకేలకు పెరిగాయి.

Update: 2024-12-07 10:41 GMT
Forex Reserves: మళ్లీ పుంజుకున్న భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తున్న భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు ఎట్టకేలకు పెరిగాయి. నవంబర్ 29తో ముగిసిన వారంలో 1.51 బిలియన్ డాలర్లు మేర పెరిగాయి. దీంతో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 658.091 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఇండియా(RBI) ఓ ప్రకటనలో తెలిపింది. అంతకముందు వారం(నవంబర్ 22) ఫారెక్స్ నిల్వలు 1.31బిలియన్ డాలర్లు తగ్గి 656.582 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివర్లో ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత నుంచి క్రమంగా తగ్గు ముఖం పట్టాయి. ఇక గోల్డ్ రిజర్వు(Gold Reserves) నిల్వలు 595 మిలియన్ డాలర్లు క్షీణించి 66.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) 22 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 18.007 బిలియన్ డాలర్లుగా నమోదవ్వగా.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) వద్ద భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 22 మిలియన్ డాలర్లు పెరిగి 4.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 

Tags:    

Similar News