Forex Reserves: మళ్లీ తగ్గిన భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!

భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు మరోసారి క్షీణించాయి.

Update: 2024-12-01 12:25 GMT
Forex Reserves: మళ్లీ తగ్గిన భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భారత విదేశీ మారక(Forex Reserves) నిల్వలు మరోసారి క్షీణించాయి. నవంబర్ 22తో ముగిసిన వారంలో 1.31 బిలియన్ డాలర్లు మేర పతనమయ్యాయి. దీంతో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 656.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఇండియా(RBI) ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఫారిన్ ఇన్సిటిట్యూషనల్ ఇన్వెస్టర్లు(FIIs) తమ పెట్టుబడులను భారత మార్కెట్ల(Indian Markets) నుంచి పెద్ద మొత్తంలో ఉపసంహరించుకోవడం, డాలర్ విలువ(Dollar value) పెరగడం ఫారెక్స్ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 704.88 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక గోల్డ్ రిజర్వు(Gold Reserves) నిల్వలు 1.82 బిలియన్ డాలర్లు క్షీణించి 67.57 బిలియన్ డాలర్ల వద్ద ముగియగా.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 15 మిలియన్ డాలర్లు తగ్గి 4.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

Tags:    

Similar News