ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు రూ. 3 వేల కోట్ల సాయం!

నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు ప్రభుత్వం మూలధన నిధులను అందించనుంది.

Update: 2023-05-10 12:49 GMT

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు ప్రభుత్వం మూలధన నిధులను అందించనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ. 3,000 కోట్ల నిధులను కేటాయించడం ద్వారా బీమా రంగంలో పోటీ పడటంతో పాటు మెరుగైన చెల్లింపుల హామీ ఉన్న వాటినే బీమాకు అంగీకరించాలని కోరింది.

2022-23 ఆర్థిక ఫలితాలు, లాభదాయకత గణాంకాలు మార్జిన్‌పై ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల పునర్నిర్మాణ ప్రభావాన్ని చూపనున్నాయి. తద్వారా మూలధన నిధులను కేటాయించి ఆయా బీమా సంస్థల మార్జిన్‌లను మెరుగు పరిచే చర్యలు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. గతేడాది మూడు ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ప్రభుత్వం రూ. 5,000 కోట్ల మూలధన సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Also Read...

హ్యాపీ టియర్స్.. ఆధ్యాత్మిక అభివృద్ధిలో కీలకంగా ఆనందభాష్పాలు 

Tags:    

Similar News