నిత్యావసర ఔషధాల ధరల పెంపుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర ఔషధాల ధరలు పెంచడం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు

Update: 2024-04-04 11:59 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర ఔషధాల ధరలు పెంచడం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు. ప్రముఖ మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో మాట్లాడిన ఆయన సాధారణంగా టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగితే నిత్యావసరాల వస్తువులు, ఔషధాల ధరలు పెరుగుతాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం స్వల్పంగా 0.005 పెరగడంతో అవసరమైన ఔషధాల ధరలను పెంచబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రతి ఏటా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యుపీఐ) ఆధారంగా మందుల సీలింగ్ ధరలను పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు.

డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్స్ (DPCO) 2013 నిబంధనల ప్రకారం, మందులను షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ ఫార్ములేషన్‌లుగా వర్గీకరించారు. నాన్-షెడ్యూల్డ్ విషయంలో, ధరను నిర్ణయించే స్వేచ్ఛ తయారీదారుకు ఉంటుంది, అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన మందుల ధరలు పెరగవని మంత్రి అన్నారు. డబ్ల్యూపీఐ ఆధారంగా ధరల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదు. ప్రస్తుత సీలింగ్ ధరలు మార్చి 31, 2025 వరకు కొనసాగుతాయని ఈ వారం ప్రారంభంలో ఒక అధికారిక ప్రకటన తెలిపింది. గత 30 ఏళ్లుగా, అధిక నాణ్యత గల జనరిక్ ఔషధాల తయారీలో భారతీయ ఔషధ పరిశ్రమ అగ్రగామిగా ఉందని మంత్రి అన్నారు.


Similar News