భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న టెస్లా కార్లు

ప్రభుత్వం రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈవీ దిగుమతులపై రాయితీని మరో 2-3 ఏళ్లు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తోంది.

Update: 2024-02-15 15:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఈవీ తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత ప్రభుత్వం రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులపై రాయితీని మరో 2-3 ఏళ్లు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమలు చేస్తే టెస్లా భారత్‌లో కార్యకలాపాలను మరింత త్వరగానే ప్రారంభం కానున్నాయి. దేశీయంగా తయారీని, ఉపాధిని పెంచేందుకు ఈవీ ధరలను తగ్గించాలని భావిస్తోంది. అందుకోసమే ఈవీ కార్ల దిగుమతులపై రాయితీ పొడిగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం భారత్ 40 వేల డాలర్లు(సుమారు రూ. 33 లక్షలు) కంటే ఎక్కువ ఎక్కువ విలువైన కార్ల దిగుమతులపై 100 శాతం సుంకాన్ని విధిస్తోంది. దీని కంటే తక్కువ ఖరీదైన వాటిపై 60 శాతం అమలవుతోంది. అయితే, దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీకి మొదటి 2-3 ఏళ్లు దిగుమతులపై రాయితీని 15 శాతం తగ్గించే టెస్లా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. పెట్టుబడులు, స్థానిక తయారీ కోసం దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News