మియాపూర్‌లో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన ఐషర్
వీఈ కమర్షియల్ వెహికల్స్‌కు వ్యాపార విభాగం ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ తమ నూతన 3ఎస్ (సేల్స్, స్పేర్స్, సర్వీస్) డీలర్‌షిప్‌ను మియాపూర్‌లోని ఎంజీబీ మోటర్..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: వీఈ కమర్షియల్ వెహికల్స్‌కు వ్యాపార విభాగం ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ తమ నూతన 3ఎస్ (సేల్స్, స్పేర్స్, సర్వీస్) డీలర్‌షిప్‌ను మియాపూర్‌లోని ఎంజీబీ మోటర్ అండ్ ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ప్రారంభించింది. దాదాపు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో బహుళ సర్వీస్ బే లు ఉన్నాయి. ఇక్కడ విడిభాగాలు, సేవా ఉపకరణాలు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండటంతో పాటుగా ఐషర్ వినియోగదారులకు మెరుగైన సేవలు లభ్యమవుతాయి.
విజయవాడ – హైదరాబాద్ –ముంబై నగరాలను కలిపే ఎన్‌హెచ్ 65పై ఉండటం చేత తూర్పు నుంచి పశ్చిమానికి దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ ఐషర్ ట్రక్స్, బస్సులకు మెరుగైన సేవలను అందిస్తుంది. హైదరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండటం చేత స్థానిక ఐషర్ వినియోగదారుల రవాణా అవసరాలు కూడా తీర్చగలదు.
ఈ సందర్భంగా వీఈసీవీ ఎస్‌వీపీ– కస్టమర్ సర్వీసెస్, నెట్ వర్క్ స్ట్రాటజీ రమేష్ రాజగోపాలన్ మాట్లాడుతూ ''తెలంగాణాలో మరింతగా కార్యకలాపాలు విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఐషర్ కుటుంబంలోకి 5వ అత్యాధునిక కేంద్రంగా ఎంజీబీ మోటర్స్ అండ్ ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్వాగతిస్తున్నాము. మా బ్రాండ్ సదుపాయం సేవా అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఐషర్ ట్రక్స్, బస్సు వినియోగదారులకు లాభదాయకతనూ మెరుగుపరుస్తుంది'' అని అన్నారు.
వీఈసీవీ ఇప్పుడు విస్తృత శ్రేణి లో ఉత్పత్తులను అందిస్తుంది. వీటిలో 4.9–55 టన్ జీవీడబ్ల్యు ట్రక్స్, 12–72 సీట్ల బస్సులు ఉన్నాయి. ఈ కంపెనీకి విస్తృత శ్రేణిలో హెచ్‌డీ ట్రక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విభిన్న ధరల వద్ద బేసిక్, ప్రీమియం, వాల్యూ విభాగాలలో వీటిని అందిస్తున్నారు.