Divi's Laboratories Q2 Results: రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించిన దివీస్ లాబొరేటరీస్

రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ(Pharma Company) దివీస్ లాబొరేటరీస్(Divi's Laboratories) త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

Update: 2024-11-10 14:15 GMT
Divis Laboratories Q2 Results: రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించిన దివీస్ లాబొరేటరీస్
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ(Pharma Company) దివీస్ లాబొరేటరీస్(Divi's Laboratories) త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సెప్టెంబరు 2024తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ అంచనాలను మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(Q2FY25)లో సంస్థ రూ.510 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.348 కోట్ల లాభంతో పోలిస్తే ఈ సారి కంపనీ లాభాలు 46.5 శాతం పెరిగాయి. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ 2024 కాలంలో కంపెనీ నికర లాభం 33.52 శాతం పెరిగి రూ.704 కోట్ల నుంచి రూ.940 కోట్లకు చేరుకుందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. అలాగే కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం పెరిగి రూ. 1,909 కోట్ల నుంచి రూ.2,338 కోట్లకు చేరిందని తెలిపింది. ఇక ఈ త్రైమాసికంలో రూ. 29 కోట్ల ఫారెక్స్ లాభాలు(Forex Profits) వచ్చాయని దివీస్ ల్యాబ్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags:    

Similar News