ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో Poco స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు
ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తీసుకొచ్చిన రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా Poco స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తీసుకొచ్చిన రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా Poco స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తుంది. జనవరి 15 నుండి ప్రారంభమైన ఈ సేల్ జనవరి 20 న ముగుస్తుంది. కొనుగోలు టైంలో వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదనంగా సిటీ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు, పే లేటర్ ఆఫర్, రూ.1000 వరకు గిఫ్ట్ కార్డ్‌లు కూడా ఉన్నాయి. అలాగే Poco స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక తగ్గింపులు కూడా ఉన్నాయి.
POCO F4 5G
6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999. స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 870 5G SoC ప్రాసెసర్ కలిగి ఉంది. 4,500 mAh బ్యాటరీని కూడా ఉంది..
POCO X4 Pro 5G
ఆఫర్‌లో భాగంగా ఫోన్ ధర రూ. 13,999. ఇది Qualcomm Snapdragon 695 SoC ద్వారా పనిచేస్తుంది. బ్యాక్‌సైడ్ 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16MP కెమెరా కూడా ఉంది. నీటి నిరోధకత కోసం IP53 రేట్ చేయబడింది.
POCO M4 5G
స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 6.58-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ధర రూ. 10,249. MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా పని చేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది. MIUI 13 ఆధారంగా ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.