21 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 17 వరకు రీఫండ్ల తర్వాత ప్రత్యక్ష పన్నులు 20.66 శాతం వృద్ధి రూ. 13.7 లక్షల కోట్లకు చేరాయి..

Update: 2023-12-18 16:30 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 17 వరకు రీఫండ్ల తర్వాత ప్రత్యక్ష పన్నులు 20.66 శాతం వృద్ధి రూ. 13.7 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 11.36 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు పన్నుల శాఖ మెరుగైన చర్యల కారణంగానే వసూళ్లు పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనా రూ. 18.23 లక్షల కోట్లలో మూడో వంతు వసూలయ్యాయి.

ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నాలుగైదు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున వసూళ్లు బడ్జెట్ అంచనా కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వసూళ్ల వృద్ధికి మెరుగైన జీఎస్టీ ఆదాయంతో పాటు పెట్టుబడుల ఉపసంహరణ, ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు వంటివి దోహదపడ్డాయి. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను ఆదాయం రూ. 6.95 లక్షల కోట్లు ఉండగా, రూ. 6.73 లక్షల కోట్ల సెక్యూరిటీ లావాదేవీల పన్నులు ఉన్నాయి.

Tags:    

Similar News