Penalty on Google : మరోసారి గూగుల్‌ అభ్యర్థనకు ఎన్‌సీఎల్ఏటీ నిరాకరణ

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోసారి చుక్కెదురైంది

Update: 2023-01-11 08:56 GMT

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోసారి చుక్కెదురైంది. ప్లేస్టోర్‌ పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఆండ్రాయిడ్ మొబైల్‌ఫోన్‌లలో గూగుల్ ఆధిపత్య హోదాను దుర్వినియోగం చేసిందనే ఆరోపణల మీద స్టేకు నిరాకరించిన తర్వాత మళ్లీ అదే తరహా గూగుల్‌కు ఆదేశాలివ్వడం గమనార్హం. తాజా ప్లేస్టోర్‌కు సంబంధించి రూ. 936.44 కోట్ల జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో డిపాజిట్ చేయాలని ఎన్‌సీఎల్ఏటీ ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది. ఆండ్రాయిల్ మొబైల్‌ఫోన్‌లలో గూగుల్ చర్యలకు సీసీఐ రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించింది. దీంతో గూగుల్‌కు మొత్తం రూ. 2,200 కోట్ల జరిమానా విధించినట్టు అయింది. గతంలో ప్లేస్టోర్ పాలసీ విషయంలో జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన సమయంలోగా పద్ధతి మార్చుకోవాలని, థర్డ్ పార్టీ యాప్‌ల కొనుగోళ్లకు చెల్లింపుల సేవలను వాడకుండా యాప్ డవలపర్లు అడ్డుకోకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ఆండ్రాయిడ్ వ్యవహారంలో విధించిన జరిమానాకు సంబంధించి గూగుల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణకు అంగీకరించింది. 

Tags:    

Similar News