ChatGPT: గూగుల్‌కు పోటీగా చాట్‌జీపీటీ కొత్త ఫీచర్.. సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా యూజ్ చేసుకునే ఛాన్స్..!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google)కు పోటీగా చాట్‌జీపీటీ(ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ(OpenAI) ఇటీవలే సెర్చ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-12-17 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google)కు పోటీగా చాట్‌జీపీటీ(ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ(OpenAI) ఇటీవలే సెర్చ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇదివరకు కేవలం పెయిడ్ యూజర్(Paid User)లకు మాత్రమే ఉండే ఈ సదుపాయం తాజాగా అందరికీ ఫ్రీగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని చాట్‌జీపీటీ ఫౌండర్ సామ్ ఆల్ట్‌మాన్(Sam Altman) ఓపెన్‌ ఏఐ నిర్వహించిన ఈవెంట్(Event)లో ప్రకటించారు. దీంతో చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజిన్ ను ఇకపై సబ్ స్క్రిప్షన్(Subscription) చేసుకోనివారు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాగా చాట్‌జీపీటీ ఇప్పటివరకు కేవలం డేటా బేస్ తో ఉన్న ఇన్ఫర్మేషన్(Information)ను మాత్రమే అందించేంది. యూజర్లు ఇక నుంచి ఈ కొత్త ఫీచర్ ద్వారా వెబ్ లింక్స్(Weblinks)తో కూడిన రియల్ టైమ్ సమాచారాన్ని ఇంటర్నెట్(Internet)లో తెలుసుకోవచ్చు. అలాగే క్రికెట్ స్కోర్, స్టాక్ న్యూస్ వంటి తదితర సమాచారాన్ని కూడా పొందొచ్చు. ఈ కొత్త ఫీచర్ వెబ్ సైట్ తో పాటు యాప్(App)లోనూ అందుబాటులోకి వచ్చింది.

Tags:    

Similar News