కొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు

గత కొన్ని సెషన్‌లుగా రికార్డు గరిష్ఠాలను తాకుతున్న సూచీలు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి.

Update: 2024-07-16 12:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని సెషన్‌లుగా రికార్డు గరిష్ఠాలను తాకుతున్న సూచీలు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లోనూ ఉదయం మెరుగైన లాభాలతో పుంజుకున్న మార్కెట్లు ఆ తర్వాత జూన్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు మెరుగ్గా రాణించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో కొనుగోళ్లు జరపడం వంటి పరిణామాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.69 పాయింట్లు లాభపడి 80,716 వద్ద, నిఫ్టీ 26.30 పాయింట్లు పెరిగి 24,613 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. కోటక్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.57 వద్ద ఉంది. 


Similar News