Bitcoin: తొలిసారి 82,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్

బిట్‌కాయిన్ తొలిసారిగా 82,000 డాలర్లను అధిగమించింది

Update: 2024-11-11 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుపొందడం క్రిప్టో మార్కెట్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రంప్ డిజిటల్ ఆస్తులకు మద్దతుగా హామీ ఇవ్వడం, క్రిప్టో మార్కెట్ అనుకూల నిర్ణయాలను ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మేజర్ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ తొలిసారిగా 82,000 డాలర్లను అధిగమించింది. తాజాగా ఆరిజోనాలో ట్రంప్ గెలుపుతో అమెరికాలోని ఏడు స్వింగ్ స్టేట్స్‌ను క్లీన్ స్వీప్ చేశారు. దీంతో క్రిప్టో మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత పెరిగింది. ఆదివారం ఒక్కరోజే బిట్‌కాయిన్ 6.1 శాతం పెరగ్గా, సోమవారం నాటికి 82,300 డాలర్లకు చేరుకుంది. బిట్‌కాయిన్‌తో పాటు డొజ్‌కాయిన్ సహా చిన్న క్రిప్టోకరెన్సీలు సైతం కొత్త గరిష్ఠాలకు చేరాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయింట్ 90 శాతం పుంజుకుంది. డిమాండ్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత వంటి కారణాలు కూడా క్రిప్టో కరెన్సీ దూసుకెళ్లేందుకు సహాయపడ్డాయి. అమెరికా ఎన్నికల ఫలితాల్లో క్రిప్టో అనుకూల అభ్యర్థి ట్రంప్ గెలుపొందడంతో ఈక్విటీ, బంగారం వంటి సాధనాల కంటే ఎక్కువ రాబడి క్రిప్టో ఇస్తుందనే అంచనాలు దీనికి మరింత మద్దతుగా నిలిచాయి. 

Tags:    

Similar News