రూ.80 వేలకే బజాజ్ CNG-పెట్రోల్ బైక్..! లాంచ్ తేదీ ఇదే..
వాహన వినియోగదారులకు అదిరిపోయే న్యూస్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న CNG బైక్ ఇండియా మార్కెట్లోకి జులై 5న లాంచ్ అవుతుందని సంబంధిత వర్గాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు
దిశ, బిజినెస్ బ్యూరో: వాహన వినియోగదారులకు అదిరిపోయే న్యూస్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న CNG బైక్ ఇండియా మార్కెట్లోకి జులై 5న లాంచ్ అవుతుందని సంబంధిత వర్గాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్-స్పెక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100కు పైనే ఉన్న నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్‌గా ఉన్నటువంటి ఈ బైక్ ద్వారా చాలా వరకు ఇంధన ఖర్చులను ఆదా చేయవచ్చు. దీనిని ఇప్పటికే చాలా సార్లు పరీక్షించారు. ఇది 125cc ఇంజిన్‌తో వస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.80,000 ఉండవచ్చని అంచనా. అయితే లాంచ్ టైంలో ధర విషయంలో కొంత వరకు మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ధరలు దాదాపు రూ.1 లక్షకు పైనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ బైక్ అంతకంటే తక్కువ ధరలో విడుదల అయినట్లయితే దేశవ్యాప్తంగా అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ భారతదేశంలో కఠినమైన రోడ్లకు అనుగుణంగా ఇది ఉంటుంది. CNG అయిపోతే, అదనంగా బ్యాకప్‌గా ఉండటానికి బైకులో ఒక చిన్న పెట్రోల్ ట్యాంక్‌ను దీనికి అమర్చారు. ఇంధన ట్యాంక్‌కి కొత్త ఆకారం ఇవ్వడంతో పాటు, పొడవాటి సీటు, చుట్టూ మినిమల్ బాడీ ప్యానెల్‌లను బైకులో అందించారు. లాంచ్ టైంలో బైకుకు సంబంధించిన మైలేజ్, ఇతర వివరాలు వెల్లడించనున్నారు.