ATM Machines: పెరిగిన యూపీఐ లావాదేవీలు.. ఏడాదిలో 4000 ఏటీఎం మిషన్లు క్లోజ్..!
కొన్నేళ్ల క్రితం మనకు డబ్బు కావాలంటే దగ్గర్లోని ఏటీఎం(ATM)కు వెళ్లి విత్‌డ్రా(Withdraw) చేసుకునే వాళ్లం.
దిశ,వెబ్‌డెస్క్: కొన్నేళ్ల క్రితం మనకు డబ్బు కావాలంటే దగ్గర్లోని ఏటీఎం(ATM)కు వెళ్లి విత్‌డ్రా(Withdraw) చేసుకునే వాళ్లం. యూపీఐ సేవలు(UPI Services) అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజులు మారాయి. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్(QR code)లను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో ట్రాన్సక్షన్స్ జరుపుతున్నారు. ఇక చిరు వ్యాపారులు(Small Traders) కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో మనీ కోసం చాలా మంది ఏటీఎంకు వెళ్లడం మానేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎంల నిర్వహణ బ్యాంకులకు కష్టంగా మారుతోంది. దీంతో భారతదేశం(India)లోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం మిషన్ల(ATM Machines)ను మూసివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గత సంవత్సరం సుమారు 4000 ఏటీఎం మిషన్లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2024 నాటికి 2,15,767 ఏటీఎంలు ఉన్నాయి. కాగా గతేడాది సెప్టెంబర్ లో ఏటీఎంల సంఖ్య 2,19,281గా ఉంది. అంటే ఏటీఎంల సంఖ్య దాదాపు 1.6 శాతం తగ్గింది. ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసేవారి సంఖ్య భారీగా తగ్గిపోవడంతో బ్యాంకులకు ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిపోతోంది. దీంతో బ్యాంకులు ఏటీఎంల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం మన ఇండియాలో రూ. 34.70 లక్షల కోట్ల డబ్బు చలామణి(Circulation)లో ఉంది. కాగా దేశంలో ప్రతి లక్ష మందికి 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి.