ఐపీఓకు సిద్ధమవుతున్న ఈవీ బ్రాండ్ ఏథర్ ఎనర్జీ

ఐపీఓ ప్రణాళికల కోసం బ్యాంకర్లతో సమావేశమైనట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Update: 2024-02-14 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బ్రాండ్, హీరో మోటోకార్ప్ మద్దతున్న ఏథర్ ఎనర్జీ త్వరలో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే కంపెనీ పలు బ్యాంకులతో పబ్లిక్ ఆఫర్ ప్రక్రియ కోసం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఐపీఓ ప్రణాళికల కోసం బ్యాంకర్లతో సమావేశమైనట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్ల వద్ద 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 3,320 కోట్లు) సేకరించాలని కంపెనీ ప్రయత్నిస్తోందని వారు తెలిపారు. ఐపీఓ ప్రక్రియ గురించి ఏథర్ ఎనర్జీ అధికారిక స్పందించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఐపీఓకు వచ్చేందుకు ఏథర్ ఎనర్జీ ప్రయత్నాలు చేసింది. అయితే, దీనిపై స్పష్టమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏథర్ ఎనర్జీ ఐపీఓ ప్రక్రియను కొంత ఆలస్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఐపీఓ పరిమాణం, వాల్యూయేషన్‌లో మార్పులు ఉండొచ్చు. 

Tags:    

Similar News