తొలి రుణ సెక్యూరిటీల బైబ్యాక్‌ను ప్రారంభించిన అదానీ గ్రూప్!

హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ వాటిని అధిగమించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-04-24 13:12 GMT

ముంబై: హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ వాటిని అధిగమించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ తన తొలి రుణ సెక్యూరిటీల బైబ్యాక్‌ను చేపట్టనున్నట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీఎస్ఈజెడ్) డెట్ సెక్యూరిటీల బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి, 2024 నాటికి గడువు ముగిసే బాండ్లను మళ్లీ కొనాలని భావిస్తోంది. తద్వారా 130 మిలియన్ డాలర్లకు టెండర్ ఆఫర్‌ను మొదలుపెట్టింది.

ఈ చర్య ద్వారా కంపెనీపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందాలని అదానీ గ్రూప్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. ఈ టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే మొత్తంగా 520 మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తామని అదానీ గ్రూప్ తెలిపింది. దానివల్ల 2024లో కంపెనీ చెల్లించే రుణాలను తగ్గించుకోవచ్చని భావిస్తోంది. అలాగే, డెట్ సెక్యూరిటీల బైబ్యాక్ ద్వారా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందవచ్చని కంపెనీ వివరించింది. 

Tags:    

Similar News