వేర్‌హౌసింగ్ వ్యాపారంలోకి ఎంటర్ అయిన Adani గ్రూప్

బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, వేర్‌హౌసింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది.

Update: 2022-12-23 04:46 GMT

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, వేర్‌హౌసింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. దీని కోసం అదానీ లాజిస్టిక్స్, DA గ్రూప్, దాని అనుబంధ సంస్థలతో జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసినట్లు అదానీ పోర్ట్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తెలిపింది. ఈ భాగస్వామ్యం 50:50 ప్రాతిపదికన, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ పార్కులను అభివృద్ధి చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్‌కు అదానీ లాజిస్టిక్స్ ముగ్గురు డైరెక్టర్లను, DA గ్రూప్ ఇద్దరు డైరెక్టర్లను నామినెట్ చేస్తుంది. అదానీ గ్రూప్ ఇటీవల దాని ఇజ్రాయెల్ భాగస్వామి గడోట్‌ గ్రూప్‌తో కలిసి జులైలో ఇజ్రాయెల్‌లోని రెండవ అతిపెద్ద ఓడరేవు అయిన హైఫా పోర్ట్‌ను ప్రైవేటీకరించడానికి టెండర్‌ను గెలుచుకుంది.

Tags:    

Similar News