Aadhaar Update: ఆధార్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీ అప్డేట్ గడువు మరోసారి పొడగింపు..!
ఆధార్ కార్డు(Aadhaar card) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డు(Aadhaar card) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్(Update) చేసుకునే గడువును మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ గడువు నేటితో ముగియనుండగా.. తాజాగా దాన్ని మరో ఆరు నెలలు అంటే 2025, జూన్ 14 వరకు పెంచింది. ఈ మేరకు యూఐడీఏఐ(UIDAI) 'ఎక్స్(X)' వేదికగా ప్రకటించింది. కాగా యూఐడీఏఐ రూల్స్ ప్రకారం పౌరులు ప్రతి పది ఏళ్లకు ఒకసారి తమ వివరాలను ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరు(Name), డేట్ ఆఫ్ బర్త్(DOB), అడ్రస్(Address) వంటి వాటిని ఆధార్ సేవా కేంద్రాల్లో లేదా UIDAI వెబ్ సైట్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా డాక్యుమెంట్లను సమర్పించాలి. కాగా ఫ్రీ గడువు ముగిసిన తర్వాత ఎప్పటిలాగే రూ. 50 ఫీజు చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.