వాగులో ఇరుక్కున్న బస్సు.. మరి ప్రయాణికులు ?

దిశ ప్రతినిధి, మహాబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా ఓ సంఘటన చేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం వయా లింగాల తెలకపల్లి, కల్వకుర్తి మీదుగా హైదరాబాద్ కు బయలుదేరింది. కాగా, […]

Update: 2020-08-16 02:09 GMT

దిశ ప్రతినిధి, మహాబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా ఓ సంఘటన చేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం వయా లింగాల తెలకపల్లి, కల్వకుర్తి మీదుగా హైదరాబాద్ కు బయలుదేరింది. కాగా, రఘుపతిపేట దగ్గర ప్రవహిస్తున్న వాగు వద్ద డ్రైవర్ రోడ్డుపై నీటిలో మునిగివున్న గుంతలను అంచనా వేయకపోవడంతో బస్సు వాగు మధ్యలో ఇరుక్కుపోయి ఆగిపోయింది. వెంటనే బస్సులో ప్రయాణికులంతా దిగిపోయారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పిఉంటే పెను ప్రమాదం జరిగేదని వారు చెప్పారు.

Tags:    

Similar News