వైద్యాధికారులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు

దిశ, ములకలపల్లి: ఓ సైబర్ నేరగాడు ఇద్దరు వైద్యాధికారులను బురిడీ కొట్టించాడు. ములకలపల్లి ప్రభుత్వ వైద్యాధికారిణిగా పనిచేస్తున్న ఉదయ లక్ష్మీకి ఫోన్ చేసి తాను విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అని పరిచయం చేసుకున్నాడు. మీ ఆసుపత్రిలో విద్యుత్ మీటర్ మార్చాలి అంటూ రూ. 5800 గూగుల్ పే ద్వారా కాజేశాడు. విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయకపోవడంతో తిరిగి అదే నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. తాను మోసపోయాను అని గమనించి స్థానిక పోలీసులను […]

Update: 2021-11-09 10:50 GMT

దిశ, ములకలపల్లి: ఓ సైబర్ నేరగాడు ఇద్దరు వైద్యాధికారులను బురిడీ కొట్టించాడు. ములకలపల్లి ప్రభుత్వ వైద్యాధికారిణిగా పనిచేస్తున్న ఉదయ లక్ష్మీకి ఫోన్ చేసి తాను విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అని పరిచయం చేసుకున్నాడు. మీ ఆసుపత్రిలో విద్యుత్ మీటర్ మార్చాలి అంటూ రూ. 5800 గూగుల్ పే ద్వారా కాజేశాడు. విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయకపోవడంతో తిరిగి అదే నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. తాను మోసపోయాను అని గమనించి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు.

ములకలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న ఉదయలక్ష్మీ ఫోన్ కి ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఈ నెల 6వ తేదీ ఫోన్ వచ్చింది. తాను విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రిలో విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కొత్త విద్యుత్ మీటర్ తక్షణమే అమర్చాలి అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఆసుపత్రికి నిధులు లేనందున కొన్ని రోజుల పాటు ఆగాలని చెప్పారు. దీనితో ఆ ఆగంతకుడు జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి కాన్ఫ్రాన్సు కలిపాడు. ఆసుపత్రిలో విద్యుత్ సమస్య ఉన్నట్లు తెలపడంతో ఉన్నతాధికారి నమ్మారు. ఆ సమస్య పరిష్కరించుకొమ్మని మండల వైద్యాధికారికి సూచించారు. విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తున్నందున మీటర్ మార్చేందుకు సిద్ధపడ్డారు. దీనికి గాను రూ. 5800 ఖర్చు అవుతుందని ఈ మొత్తాన్ని ఆన్లైన్ పేమెంట్ చెల్లించాలని దీనికి మరో ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ ఆగంతకుడు ఇచ్చిన నంబర్ కు వైద్యురాలు రూ. 5800 ట్రాన్స్ఫార్ చేశారు. పనుల ఒత్తిడిలో ఉన్న అధికారి మంగళవారం సిబ్బందిని కొత్త విద్యుత్ మీటర్ గురించి ఆరా తీశారు. ఎవ్వరూ రాలేదని, అలాంటి పనులు ఏమి జరగలేదని చెప్పారు. దీనితో ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ చేసిన నంబర్ కు కాల్ చేయగా అది ఖమ్మం లోని ఆమె పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వ్యక్తిది గా తేలింది. తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి డబ్బులు తీసుకు వెళ్లాడని తెలిపాడు. దీనితో మోసపోయానని గమనించిన వైద్యురాలు స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News