అమ్మో అవన్నీ పైసలేనా.. ?

దిశ, వెబ్ డెస్క్ : పొద్దున లేసి ఎవరి మోహం చూశానో కానీ 500 నోట్లకట్ట దొరికింది అని మురిసిపోతాం అయితే అలానే అనుకున్న ఓ కార్మికురాలు చివరికి భయాని గురైంది. రోజువారి విధిలో భాగంగా తాడేపల్లి పంచాయితీ కార్మికులు చెత్తను తొలిగించడానికి వెళ్లారు. చెత్త తొలగించే క్రమంలో వారికి రూ.2000, రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. మొదట రూ.500 నోట్ల కట్ట కనబడగా, పంచాయతీ కార్మికులు దానిని తీసి దాచిపెట్టారు. అంతలో మరో 200 నోటు […]

Update: 2021-03-30 01:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : పొద్దున లేసి ఎవరి మోహం చూశానో కానీ 500 నోట్లకట్ట దొరికింది అని మురిసిపోతాం అయితే అలానే అనుకున్న ఓ కార్మికురాలు చివరికి భయాని గురైంది. రోజువారి విధిలో భాగంగా తాడేపల్లి పంచాయితీ కార్మికులు చెత్తను తొలిగించడానికి వెళ్లారు. చెత్త తొలగించే క్రమంలో వారికి రూ.2000, రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. మొదట రూ.500 నోట్ల కట్ట కనబడగా, పంచాయతీ కార్మికులు దానిని తీసి దాచిపెట్టారు. అంతలో మరో 200 నోటు కనిపించింది. తాను చెత్త తీస్తూ ఉంటే నోట్లకట్టలు బయిటికి వచ్చాయి. ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. చెత్త తీసేకొద్దీ కట్టలు కట్టలు బయటపడడంతో ఆందోళన చెందిన పంచాయతీ కార్మికులు సచివాలయం సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే సిబ్బంది వచ్చి ఆనోట్లను పరిశీలించారు. మొదట వాటని దొంగనోట్లు అనుకున్నారు. కానీ నోట్ల కట్టలన్నింటినీ పరిశీలించగా వాటిపై ‘చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’, ‘ఫర్‌ స్కూల్‌ జోన్‌ ఓన్లీ’ అని రాసి ఉండటంతో సిబ్బంది తనలో తాను నవ్వుకొని ఆకట్టలను అదే చెత్తకుప్పలో పడేసి యార్డుకు తరలించారు.

Tags:    

Similar News