అనుమతుల్లేని అంతస్తులు..!

దిశ జవహర్ నగర్ : కాప్రా మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అనుమతులేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించడం లేదు. ఇంటి యజమానుల నుంచి తమ సిబ్బంది ద్వారా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతుండడం ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాప్రా మున్సిపల్ పరిధిలోని రెండో డివిజన్, జమ్మిగడ్డ, బీజేఆర్ కాలనీ, సాయిలోక్ కాలనీతోపాటు తదితర కాలనీలో విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా 3, 4 […]

Update: 2020-11-04 02:33 GMT

దిశ జవహర్ నగర్ : కాప్రా మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అనుమతులేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించడం లేదు. ఇంటి యజమానుల నుంచి తమ సిబ్బంది ద్వారా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతుండడం ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

కాప్రా మున్సిపల్ పరిధిలోని రెండో డివిజన్, జమ్మిగడ్డ, బీజేఆర్ కాలనీ, సాయిలోక్ కాలనీతోపాటు తదితర కాలనీలో విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా 3, 4 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఆయా బస్తీలా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుళ అంతస్తులు చేపడుతున్న జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహించడం వెనుక అర్థం ఏంటని ఆయా కాలనీల వాసులు ప్రశ్నిస్తున్నారు.

భవన యజమానుల నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, అంతేకాకుండా తమ కిందిస్థాయి సిబ్బందితో ఇంటి యజమానులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్న అధికారుల తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా ఉందని పలువురు అంటున్నారు.

Tags:    

Similar News