మోకిల – టంగుటూరు మధ్య మూసీ వాగుపై వంతెన నిర్మించాలి: రైతులు
దిశ, శంకర్ పల్లి: మోకిలా టంగుటూరు గ్రామాల మధ్య గల మూసీ వాగుపై వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నారు. మూసీ వాగుపై వంతెన లేకపోవడం వల్ల ఆయా గ్రామాల రైతులు తాము పండించిన పంటలు మార్కెట్ కు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తదని, దీంతో రాకపోకలు స్తంభిస్తాయని వారు తెలిపారు. పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఎలిమేల తండా, […]
దిశ, శంకర్ పల్లి: మోకిలా టంగుటూరు గ్రామాల మధ్య గల మూసీ వాగుపై వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నారు. మూసీ వాగుపై వంతెన లేకపోవడం వల్ల ఆయా గ్రామాల రైతులు తాము పండించిన పంటలు మార్కెట్ కు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తదని, దీంతో రాకపోకలు స్తంభిస్తాయని వారు తెలిపారు. పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఎలిమేల తండా, మోకిల టంగుటూరు వరకు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసిన అధికారులు వంతెనకు నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.