కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ సంస్థ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తెచ్చింది. ముఖ్యంగా రూ.500 కంటే తక్కువకే ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవారికి వీటివల్ల ప్రయోజనాలు ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డేటా వోచర్లతో పాటు వాయిస్ ప్లాన్, అలాగే రెండూ కలిగిన కాంబో ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. డేటా వోచర్ల విభాగంలో రూ.75 రీఛార్జ్ ద్వారా 50 రోజుల వ్యాలిడిటీ, 2జీబీ, 100 నిమిషాల ఉచిత కాల్స్ లభించనున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ సంస్థ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తెచ్చింది. ముఖ్యంగా రూ.500 కంటే తక్కువకే ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవారికి వీటివల్ల ప్రయోజనాలు ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డేటా వోచర్లతో పాటు వాయిస్ ప్లాన్, అలాగే రెండూ కలిగిన కాంబో ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. డేటా వోచర్ల విభాగంలో రూ.75 రీఛార్జ్ ద్వారా 50 రోజుల వ్యాలిడిటీ, 2జీబీ, 100 నిమిషాల ఉచిత కాల్స్ లభించనున్నాయి.
రూ.94తో 75 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ డాటా, 100 నిమిషాల ఉచిత కాల్స్ లభిస్తాయి. రూ.198తో 50 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. 2జీబీ తర్వాత 40కేబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభిస్తుంది. రూ.447 రీఛార్జ్‌తో 100జీబీ డేటా, రోజుకు 100 నిమిషాల ఉచితకాల్స్ అందుకోవచ్చు. వాయిస్ కాల్స్ వోచర్లలో రూ.319 ద్వారా 75 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 6జీబీ డేటా వస్తుంది. అలాగే, 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.247 రీఛార్జ్‌తో అపరిమిత ఉచిత కాల్స్, 50జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఉచిత మెసేజ్‌లు చేసుకోవచ్చు.
కాంబో విభాగంలో రూ.429 ద్వారా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. 81 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 1జీబీ వాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. రూ.298 ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 1జీబీ, 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. 56 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.499తో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడిచింది.