టెన్నిస్‌కు బ్రయన్ బ్రదర్స్ వీడ్కోలు?
దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన డబుల్స్ జంటగా పేరు తెచ్చుకున్న బాబ్ బ్రయన్, మైక్ బ్రయన్‌లు తమ ఆటకు వీడ్కోలు పలుకనున్నట్టు తెలుస్తోంది. యూఎస్ ఓపెన్ ఎంట్రీ లిస్టును బుధవారం ప్రకటించగా ఆ జాబితాలో బ్రయన్ బ్రదర్స్ పేర్లు లేవు. 42 ఏళ్ల ఈ కవలలు ఇక ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని, ఈ విషయం తెలిసి యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఎంట్రీ లిస్టులో వాళ్ల పేర్లను చేర్చలేదనే వార్తలు […]
దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన డబుల్స్ జంటగా పేరు తెచ్చుకున్న బాబ్ బ్రయన్, మైక్ బ్రయన్‌లు తమ ఆటకు వీడ్కోలు పలుకనున్నట్టు తెలుస్తోంది. యూఎస్ ఓపెన్ ఎంట్రీ లిస్టును బుధవారం ప్రకటించగా ఆ జాబితాలో బ్రయన్ బ్రదర్స్ పేర్లు లేవు. 42 ఏళ్ల ఈ కవలలు ఇక ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని, ఈ విషయం తెలిసి యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఎంట్రీ లిస్టులో వాళ్ల పేర్లను చేర్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాలిఫోర్నియాకు చెందిన ఈ డబుల్స్ జంట 1995లో గ్రాండ్ స్లామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ తర్వాత రిటైర్ అవ్వొచ్చంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో ముందుగానే ఆ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ బ్రయన్ బ్రదర్స్ మాత్రం వారి నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 25 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో 119 టైటిల్స్ గెలుచుకున్నారు. వీటిలో 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.