నల్లగొండలో యువకుడి దారుణ హత్య

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం పాతబస్తీలో ఓ యువకుడు శనివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో రెండు వారాల్లో నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు హత్యలు జరగడంతో.. పట్టణ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నల్లగొండ పాతబస్తీకి చెందిన మమ్మద్ ఫయాజ్ అహ్మద్, బుస్రా తబస్సంలకు షోయబ్ అహ్మద్, షాబాద్ అహ్మద్ లు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు షోయబ్ పాలిటెక్నిక్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. చిన్న కుమారుడు షాబాద్ అహ్మద్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. […]

Update: 2021-08-21 10:51 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం పాతబస్తీలో ఓ యువకుడు శనివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో రెండు వారాల్లో నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు హత్యలు జరగడంతో.. పట్టణ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నల్లగొండ పాతబస్తీకి చెందిన మమ్మద్ ఫయాజ్ అహ్మద్, బుస్రా తబస్సంలకు షోయబ్ అహ్మద్, షాబాద్ అహ్మద్ లు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు షోయబ్ పాలిటెక్నిక్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. చిన్న కుమారుడు షాబాద్ అహ్మద్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.

కాగా, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జానీ, షోయబ్ అహ్మద్ లు స్నేహితులు. వారిద్ధరి మధ్య ఘర్షణ జరిగిందని, కొంత కాలంగా మాట్లాడుకోవడం మానేశారని స్థానికుల ద్వారా తెలిసింది. అయితే నల్లగొండ గడియారం సెంటర్ నుంచి పాత బస్తీ వైపు మొహర్రంలో భాగంగా పీర్లు ఊరేగింపుగా వెళుతున్నాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే షోయబ్ అహ్మద్ (25) మెడపై జానీ కత్తితో విచక్షణా రహితంగా పోడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని షోయబ్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, నిందితుడు జానీని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేశారని, అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మొహర్రం ఊరేగింపు కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడంతో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ బాలగోపాల్ భద్రతా చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గాలిస్తున్నారు. మృతుడి తండ్రి మహ్మద్ ఫయాజ్ అహ్మద్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు వారాల్లో ఒక్క నల్లగొండ పట్టణంలోనే నాలుగు హత్యలు కావడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News