బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకా పంపిణీ షురూ

 లండన్ : బ్రిటన్‌లో పౌరులకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఈ టీకా పొందిన తొలి వ్యక్తిగా 82 ఏడ్ల బ్రియన్ పింకర్ రికార్డు సృష్టించారు. ఆయన ఓ డయాలసిస్ పేషెంట్. ఆక్స్‌ఫర్డ్/ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌లో పింకర్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. ‘ఈరోజు కొవిడ్ వ్యాక్సిన్ పొందినందుకు […]

Update: 2021-01-04 06:48 GMT

లండన్ : బ్రిటన్‌లో పౌరులకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఈ టీకా పొందిన తొలి వ్యక్తిగా 82 ఏడ్ల బ్రియన్ పింకర్ రికార్డు సృష్టించారు. ఆయన ఓ డయాలసిస్ పేషెంట్. ఆక్స్‌ఫర్డ్/ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌లో పింకర్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు.

‘ఈరోజు కొవిడ్ వ్యాక్సిన్ పొందినందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ టాకాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేయడం పట్ల గర్వ పడుతున్నాను. వైద్య బృందం ఎంతో గొప్పగా పనిచేస్తున్నది. ఈ ఏడాది చివరలో నా భార్య షిర్లేతో కలసి 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి నిజంగా ఎదురు చూస్తున్నాను’ అని పింకర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News