16 ఏండ్లుగా చెక్కు చెదరని రికార్డు !

ఇప్పుడంటే టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగిపోవడంతో టెస్టు మ్యాచ్‌లు చూసే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ధనాధన్ క్రికెట్ రాకతో వన్డేలను కూడా బోర్‌గా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఒకప్పుడు సాంప్రదాయ టెస్టు క్రికెట్‌కు చాలా ఆదరణ ఉండేది. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ గంటలు, రోజుల పాటు బ్యాటింగ్ చేయడం ఒక ఆద్భుతమైన టాలెంట్. వన్డే, టీ20లు వచ్చాక టెస్టుల్లో నిలకడగా బ్యాటింగ్ చేసేవాళ్లే కరువయ్యారు. దీంతో అప్పటి టెస్టు రికార్డులు కూడా ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అలాంటి […]

Update: 2020-04-12 07:12 GMT

ఇప్పుడంటే టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగిపోవడంతో టెస్టు మ్యాచ్‌లు చూసే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ధనాధన్ క్రికెట్ రాకతో వన్డేలను కూడా బోర్‌గా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఒకప్పుడు సాంప్రదాయ టెస్టు క్రికెట్‌కు చాలా ఆదరణ ఉండేది. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ గంటలు, రోజుల పాటు బ్యాటింగ్ చేయడం ఒక ఆద్భుతమైన టాలెంట్. వన్డే, టీ20లు వచ్చాక టెస్టుల్లో నిలకడగా బ్యాటింగ్ చేసేవాళ్లే కరువయ్యారు. దీంతో అప్పటి టెస్టు రికార్డులు కూడా ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అలాంటి ఒక అరుదైన రికార్డు సరిగ్గా 16 ఏండ్ల క్రితం నమోదైంది. 2004 ఏప్రిల్ 12న విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా క్వాడ్రాపుల్ సెంచరీ (400 పరుగులు) నమోదు చేసి రికార్డు సృష్టించాడు. అప్పటి వరకు సెంచరీ, డబుల్ సెంచరీ లేదా ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్లున్నారు. కానీ చరిత్రలో తొలిసారి 400 పరుగులు చేసి ఔరా అనిపించాడు లారా. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ అందుకోలేకపోవడం విశేషం.

లారా తర్వాతి స్థానాల్లో మాథ్యూ హెడెన్ (380), గ్యారీ సోబర్స్ (375) ఉన్నారు.

2003లో జింబాబ్వేపై మాథ్యూ హేడెన్ 380 పరుగులు చేసి గ్యారీ సోబర్స్ రికార్డును బద్దలు కొట్టాడు. కానీ హేడెన్ రికార్డు ఏడాది తిరగక ముందే బద్దలైపోయింది. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో లారా 400 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది ఇంగ్లాండ్ జట్టు విండీస్‌లో పర్యటించింది. లారా.. తొలి మూడు టెస్టుల్లో కలిపి 100 పరుగులు కూడా చేయకపోవడంతో విమర్శల పాలయ్యాడు. కాగా, నాలుగో టెస్టులో క్రీజులో పాతుకొని పోయి 400 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. 582 బంతులెదుర్కొన్న లారా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఈ పరుగులు చేశాడు. దీంతో విండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 751 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకే ఆలౌటై.. ఫాలోఆన్ ఆడినా ఓటమి నుంచి గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 422/5 రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, లారా ఇన్నింగ్స్ కోసమే విండీస్ జట్టు మూడు రోజుల పాటు తొలి ఇన్నింగ్స్ ఆడింది. ఈ సిరీస్‌ను విండీస్ జట్టు 0-3 తేడాతో కోల్పోవడం గమనార్హం.

tags : Brian Lara, Quadruple century, Test, England, West Indies

Tags:    

Similar News