మరో రెండు రోజుల పాటు వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షసూచన కారణంగా వాతావరణశాఖ తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వర్షసూచన చేసింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడుకున్న వర్షం పడనుంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షానికి అవకాశం ఉన్నట్లు తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు మొదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలోనూ పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలకు అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.