భారత్ బయోటెక్‌కు బ్రెజిల్ షాక్
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ యాజమాన్యనికి బ్రెజిల్ బిక్ షాక్ఇచ్చింది. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కాంట్రాక్ట్ విలువ 324 మిలియన్ డాలర్లు. ఫెడరల్ కంప్రోలర్ మార్గదర్శకాలు, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడమే దీనికి కారణం అని భావిస్తున్నారు. టీకా ఒప్పదంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే కారణంతో ఈ కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ యాజమాన్యనికి బ్రెజిల్ బిక్ షాక్ఇచ్చింది. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కాంట్రాక్ట్ విలువ 324 మిలియన్ డాలర్లు. ఫెడరల్ కంప్రోలర్ మార్గదర్శకాలు, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడమే దీనికి కారణం అని భావిస్తున్నారు. టీకా ఒప్పదంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే కారణంతో ఈ కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేసినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే సీజీయూ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు లేవని, అయితే మరింత లోతైన విశ్లేషణ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. టీకా పరీక్షలు పూర్తికాకముందే అధిక ధరలకు టీకా కోసం ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు రావడంతో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసీక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు.