‘కోహ్లి, రోహిత్‌లను ఎలా అవుట్ చేయాలని అంపైర్‌నే అడిగాడు’

దిశ, స్పోర్ట్స్: ఏ జట్టయినా ప్రత్యర్థి బ్యాట్స్‌మాన్‌ను అవుట్ చేయడానికి రకరకాల వ్యూహాలు రచిస్తుంటుంది. భారీ భాగస్వామ్యం నెలకొల్పే బ్యాట్స్‌మెన్‌ను విడదీయడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం కెప్టెన్, బౌలర్ ఇతర సహచరులతో కలసి సలహాలు, సూచనలు తీసుకొని అమలు చేస్తుంటారు. కానీ, ఒక జట్టు కెప్టెన్ ఏకంగా అంపైర్‌నే ‘వాళ్లను ఎలా అవుట్ చేయాలి’ అని అడిగాడంటా. ఇండియాలో బెంగళూరు వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు దంచి కొడుతున్నారు. ఆ సమయంలో […]

Update: 2020-06-10 07:24 GMT

దిశ, స్పోర్ట్స్: ఏ జట్టయినా ప్రత్యర్థి బ్యాట్స్‌మాన్‌ను అవుట్ చేయడానికి రకరకాల వ్యూహాలు రచిస్తుంటుంది. భారీ భాగస్వామ్యం నెలకొల్పే బ్యాట్స్‌మెన్‌ను విడదీయడానికి కృషి చేస్తుంది. ఇందుకోసం కెప్టెన్, బౌలర్ ఇతర సహచరులతో కలసి సలహాలు, సూచనలు తీసుకొని అమలు చేస్తుంటారు. కానీ, ఒక జట్టు కెప్టెన్ ఏకంగా అంపైర్‌నే ‘వాళ్లను ఎలా అవుట్ చేయాలి’ అని అడిగాడంటా. ఇండియాలో బెంగళూరు వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు దంచి కొడుతున్నారు. ఆ సమయంలో వారి భాగస్వామ్యాన్ని విడదీయకపోతే మ్యాచ్ చేజారడం ఖాయమని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ భావించాడు. వారిని ఎలా అవుట్ చేయాలో అర్థం కాక, అంపైర్ మైఖెల్ గాఫ్‌ను సలహా అడిగాడంటా. ఈ విషయం స్వయంగా గాఫ్ వెల్లడించాడు. స్క్వేర్ లెగ్‌లో అంపైరింగ్ చేస్తుండగా తన పక్కన ఫీల్డింగ్ చేస్తున్న ఫించ్, ఇప్పుడు వీరిని అవుట్ చేయడానికి ఎలాంటి బౌలింగ్ చేయించాలి అని అడిగాడు. దానికి గాఫ్ ‘నాకు చేతినిండా పనుంది. నీ పని నీకుంది’ అని సమాధానం చెప్పాడు. చివరకు ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లిలు కలసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

Tags:    

Similar News