స్వయంకృషితో సాధించిన మహిళలు

దిశ, ఫీచర్స్: కుటుంబ భారాన్ని మోసేందుకు భర్తలు పడుతున్న కష్టాన్ని చూసి అండగా నిలవాలనుకున్నారు. వీరి సంకల్పానికి కాకతీయ మహిళా మాక్ లిమిటెడ్ మార్గదర్శనం తోడైంది. అలా సంస్థ ఆధ్వర్యంలో మండలంలోనే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో మిల్లెట్ వ్యాపారంలో అద్భుతాలు చేస్తున్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన దాదాపు 500 మంది మహిళలు కినోవా, జోవర్, తదితర రకాల చిరుధాన్యాలును విక్రయించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద కాకతీయ మహిళా మాక్స్ […]

Update: 2021-10-17 05:07 GMT

దిశ, ఫీచర్స్: కుటుంబ భారాన్ని మోసేందుకు భర్తలు పడుతున్న కష్టాన్ని చూసి అండగా నిలవాలనుకున్నారు. వీరి సంకల్పానికి కాకతీయ మహిళా మాక్ లిమిటెడ్ మార్గదర్శనం తోడైంది. అలా సంస్థ ఆధ్వర్యంలో మండలంలోనే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో మిల్లెట్ వ్యాపారంలో అద్భుతాలు చేస్తున్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన దాదాపు 500 మంది మహిళలు కినోవా, జోవర్, తదితర రకాల చిరుధాన్యాలును విక్రయించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద కాకతీయ మహిళా మాక్స్ లిమిటెడ్‌తో కలిసి పని చేస్తున్నారు.

ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ మహిళలు ‘కాకతీయ మహిళా మాక్స్ లిమిటెడ్‌’ CEO తాళ్లపల్లి వెంకట స్వామి సాయంతో ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. 8 మార్చి, 2021న కేవలం ఆరుగురు సభ్యులతో ప్రారంభమైన సంస్థకు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుండగా.. వీరి మొదటి యూనిట్‌ రూ .2 లక్షల వ్యయంతోనే ఏర్పాటు చేయబడింది. ఇక సంస్థ వివరాలను వెల్లడించిన సీఈవో వెంకట స్వామి.. ‘కొవిడ్ తర్వాత పోషకాహారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. మిల్లెట్‌లో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని తాము ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపించాలని నిర్ణయించుకున్నాం. మొదట ఆరుగురు మహిళలతో మొదలుపెట్టాం. ప్రస్తుతం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో కనీసం 500 మంది మహిళలు పనిచేస్తున్నారు. మేము ప్రస్తుతం రైతుల నుంచి ఫింగర్(రాగుల), సోర్గమ్ (జొన్న), ఫాక్స్‌టైల్ (కొర్ర) వంటి మిల్లెట్ రకాలను నేరుగా కొనుగోలు చేస్తున్నాం. అంతేకాదు రైతుల నుంచి మూడు టన్నుల మినుముల కొనుగోలుకు కంపెనీ ప్రతి నెలా రూ .2 లక్షలు ఖర్చు చేస్తోంది’ అని స్వామి చెప్పారు.

ఈ మహిళలు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 10 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. స్వల్ప వ్యవధిలో ఇంతటి విజయాన్ని తాము ఊహించలేదని స్వయం సహాయక బృందం (SHG) కోసం పనిచేస్తున్న G కవిత చెప్పారు. ‘త్వరలో జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయగల సామర్థ్యాన్ని సాధించాం. ఇందుకోసం స్థానిక మహిళా గ్రూపులకు అవగాహన కల్పించడానికి అన్ని గ్రామాలను సందర్శిస్తున్నాం. ఈ గ్రూప్‌లోని ప్రతీ సభ్యుడు నెలకు రూ. 10,000 నుంచి రూ .15,000 సంపాదిస్తున్నారు. కాకతీయ మహిళా మాక్ లిమిటెడ్ వారి మద్దతుకు మా కృతజ్ఞతలు’ అని తెలిపింది.

Tags:    

Similar News