కరోనా భయం.. ఆస్ట్రాలజీకి లాభం
మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్ అని ఓ సినిమా డైలాగ్. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. కరోనా ఎన్నేళ్లు ఉంటుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో శాస్త్రవేత్తలు ఓ మోస్తరు అంచనా వేయగలరు. కానీ కరోనా వల్ల జీవితం ఎలా మారబోతోంది? ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే విషయాలు మాత్రం శాస్త్రవేత్తలు చెప్పలేరు. కానీ వాటి గురించి చెప్పగలమంటూ ముందుకువచ్చేవారు ఇండియాలో చాలా మంది ఉన్నారు. వారే ఆస్ట్రాలజిస్టులు… అదేనండీ జ్యోతిష్కులు! కరోనా వల్ల […]
మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్ అని ఓ సినిమా డైలాగ్. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. కరోనా ఎన్నేళ్లు ఉంటుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో శాస్త్రవేత్తలు ఓ మోస్తరు అంచనా వేయగలరు. కానీ కరోనా వల్ల జీవితం ఎలా మారబోతోంది? ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే విషయాలు మాత్రం శాస్త్రవేత్తలు చెప్పలేరు. కానీ వాటి గురించి చెప్పగలమంటూ ముందుకువచ్చేవారు ఇండియాలో చాలా మంది ఉన్నారు. వారే ఆస్ట్రాలజిస్టులు… అదేనండీ జ్యోతిష్కులు!
కరోనా వల్ల పెరిగిన భయంతో జ్యోతిష్కులకు డిమాండ్ పెరిగింది. దీనికి ఉదాహరణగా ఢిల్లీలోని ఆస్ట్రో టాక్ స్టార్టప్ కంపెనీని తీసుకోవచ్చు. ఆస్ట్రాలజీ సేవలు అందించే ఈ సంస్థకు గతేడాది వరకు అడపాదడపా ఆర్డర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు రోజుకు 12 గంటల పాటు వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒత్తిడికి గురవుతున్నారు. సరాసరిన ఒక రోజుకు రూ. 14 లక్షల బిజినెస్ అవుతోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా అంటున్నారు. గతేడాది నవంబర్‌లో రోజుకి రూ. 5 లక్షల బిజినెస్ మాత్రమే జరిగేదని ఇప్పుడు వారి ఉద్యోగులు తీరిక ఉండటం లేదని పునీత్ చెబుతున్నారు. వినియోగదారులు ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఉద్యోగం, ఆరోగ్యం గురించే ఉంటున్నాయని, అంతేకాకుండా ఒకప్పుడు పొద్దున్న, మధ్యాహ్నం కాల్ చేసే వినియోగదారులు ఇప్పుడు రాత్రి 8 తర్వాత కాల్ చేస్తున్నారని, కరోనా కారణంగా చాలా విప్లవాత్మక మార్పు వచ్చిందని పునీత్ వివరించారు.