తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటడమే ‘టాక్’ లక్ష్యం

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేలా ప్రతి ఏటా లండన్‌లో బోనాలు, వీధుల్లో తొట్టె ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. మంగళవారం టాక్ ఆధ్వర్యంలో బోనాల జాతర, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి […]

Update: 2021-07-14 07:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేలా ప్రతి ఏటా లండన్‌లో బోనాలు, వీధుల్లో తొట్టె ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. మంగళవారం టాక్ ఆధ్వర్యంలో బోనాల జాతర, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి చాటేలా బోనాల పండుగను నిర్వహించామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి, సభ్యులు సురేష్ బుడుగం, స్వాతి, నవీన్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాతి, సుప్రజ, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్, హరిగౌడ్, గణేష్, రవి రెటినేని, రవి పులుసు, మాధవ్ రెడ్డి, వంశీ వందన్, భూషణ్, అవినాష్, వంశీ కృష్ణ, పృథ్వీ, శ్రీలక్ష్మి, విజిత, క్రాంతి, భరత్, వంశీ పొన్నం, చింటు, రమ్య, స్వప్న, లాస్య, పూజిత, బిందు, మాధవి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News