తమిళనాడు సీఎం ఇంటికి బాంబ్ బెదిరింపు.. పోలీసులు వెళ్లి చూడగానే..

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సీఎం ఇంట్లో బాంబు పెట్టారని, మరికాసేపట్లో పేలుతుందని ఒక అగంతకుడు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే అల్వార్ పేట చిత్తరంజన్ వీధిలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు, జాగిలంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఫేక్ కాల్ అని తేలడంతో.. పోలీసులు కేసు నమోదు […]

Update: 2021-05-23 01:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సీఎం ఇంట్లో బాంబు పెట్టారని, మరికాసేపట్లో పేలుతుందని ఒక అగంతకుడు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే అల్వార్ పేట చిత్తరంజన్ వీధిలోని సీఎం ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ నిపుణులు, జాగిలంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఫేక్ కాల్ అని తేలడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. భువనేశ్వర్ అనే యువకుడు ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మతిస్థిమితం కోల్పోయి అతడు కాల్ చేసినట్లు తేలింది.

Tags:    

Similar News