సంచిలో బాంబు.. బైక్‌పై తీసుకెళ్తుండగా పేలింది

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపొరూర్ లో బాంబు పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్యాంగ్ గొడవల్ల ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ఓ ముఠా.. సంచిలో బాంబులను బైక్ పై తీసుకెళ్తుండగా అందులో ఒక బాంబు పేలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ సంచిలోని మిగతా బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గాయాలైన వారిపై గతంలో […]

Update: 2020-08-28 22:26 GMT
సంచిలో బాంబు.. బైక్‌పై తీసుకెళ్తుండగా పేలింది
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపొరూర్ లో బాంబు పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్యాంగ్ గొడవల్ల ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ఓ ముఠా.. సంచిలో బాంబులను బైక్ పై తీసుకెళ్తుండగా అందులో ఒక బాంబు పేలింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ సంచిలోని మిగతా బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గాయాలైన వారిపై గతంలో పలు దోపిడీ, హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News