బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తల్లి నీతూ కపూర్ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. రణ్‌బీర్ ప్రజెంట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ రికవర్ అవుతున్నాడని చెప్పింది. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ కోలుకుంటున్నాడని, త్వరలో రణ్‌బీర్ తిరిగి మీ ముందుకు వస్తాడని ఆమె పేర్కొంది. కాగా ఇటీవల ‘బ్రహ్మస్త్ర’ షూటింగ్‌లో పాల్గొన్న రణ్‌బీర్ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత రణ్‌బీర్ ‘అర్జున్‌రెడ్డి’ […]
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తల్లి నీతూ కపూర్ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. రణ్‌బీర్ ప్రజెంట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ రికవర్ అవుతున్నాడని చెప్పింది. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ కోలుకుంటున్నాడని, త్వరలో రణ్‌బీర్ తిరిగి మీ ముందుకు వస్తాడని ఆమె పేర్కొంది. కాగా ఇటీవల ‘బ్రహ్మస్త్ర’ షూటింగ్‌లో పాల్గొన్న రణ్‌బీర్ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత రణ్‌బీర్ ‘అర్జున్‌రెడ్డి’ ఫేం డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘యానిమల్’ చిత్రంలో డార్క్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నారు.