బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్‌కు చెందిన మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసరి, ఎంఎస్ ధోనీ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన సందీప్ నహర్ (32) ముంబై గోరెగావ్‌లోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భార్య గమనించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సోమవారం సాయంత్రం ఆయన తన ఫేస్ బుక్‌లో సందీప్ నహర్ సూసైడ్ నోట్ పోస్ట్ చేశారు. ఆ […]

Update: 2021-02-15 20:43 GMT
బాలీవుడ్ నటుడు ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్‌కు చెందిన మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసరి, ఎంఎస్ ధోనీ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన సందీప్ నహర్ (32) ముంబై గోరెగావ్‌లోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భార్య గమనించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

సోమవారం సాయంత్రం ఆయన తన ఫేస్ బుక్‌లో సందీప్ నహర్ సూసైడ్ నోట్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా, ఆ సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూనే.. తన భార్య కాంచన్, అత్త రెండేళ్లుగా తీవ్రంగా వేధించడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భార్యతో తనకు విభేదాలు ఉన్నాయని రాశారు. తన సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమ రాజకీయాలతో చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో మిస్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News