బీఎండబ్ల్యూలో 6 వేల ఉద్యోగుల తొలగింపు!

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోత చేపట్టిన కంపెనీల జాబితాలో జపాన్ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ 6 వేల మందిని తొలగించడానికి రెడీ అవుతోంది. ముందస్తు పదవీ విరమణపై వీరందరినీ పంపంచేందుకు బీఎండబ్ల్యూ సిద్ధమవుతోంది. విక్రయాలు తగ్గిపోవడంతో పాటు మందగమనం, కరోనా వ్యాప్తి వల్ల ఆర్థిక కష్టాలు ఉన్నందున ఇప్పటికే ఉద్యోగులతో పదవీ విరమణపై ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ముందస్తు పదవీ విరమణకు ఉద్యోగ ప్రతినిధులు […]

Update: 2020-06-21 07:07 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోత చేపట్టిన కంపెనీల జాబితాలో జపాన్ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ 6 వేల మందిని తొలగించడానికి రెడీ అవుతోంది. ముందస్తు పదవీ విరమణపై వీరందరినీ పంపంచేందుకు బీఎండబ్ల్యూ సిద్ధమవుతోంది. విక్రయాలు తగ్గిపోవడంతో పాటు మందగమనం, కరోనా వ్యాప్తి వల్ల ఆర్థిక కష్టాలు ఉన్నందున ఇప్పటికే ఉద్యోగులతో పదవీ విరమణపై ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ముందస్తు పదవీ విరమణకు ఉద్యోగ ప్రతినిధులు అంగీకరించారని కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగానే రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారిపై కంపెనీ దృష్టి సారించింది. ప్రపంచంలో 1,33,778 మంది బీఎండబ్ల్యు ఉద్యోగులున్నారు. వీరిలో 6,000 మంది ఉద్యోగుల సంఖ్య 5 శాతం కంటే తక్కువని కంపెనీ తెలిపింది. వైరస్ వల్ల ఆర్థిక పరమైన నష్టాలతో పాటు యూరప్ ప్రాంతంలో కొత్త కార్లకు డిమాండ్ క్షీణించిందని పేర్కొంది. కరోనాతో పాటు పలు కారణాలతో మే నెలలో విక్రయాలు 50 శాతం తగ్గాయి. యూరోపియన్ యూనియన్‌లో 52 శాతం విక్రయాలు పడిపోయాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 78.3 శాతం క్షీణించినట్టు కంపెనీ తెలిపింది. కాగా, బీఎండబ్ల్యూ తొలగించే ఉద్యోగాలన్నీ దాదాపు జర్మనీలోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక, బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెండ్‌గా విక్రమ్ పవా నియమితులయ్యారు. బీఎండబ్ల్యూ గ్రూప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రెసిడెంట్‌గా ఉన్న విక్రమ్ ఆగస్ట్ 1 నుంచి ఇండియా బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News