మహిళా ప్యాసింజర్ల కోసం వెయిటింగ్ లాంజ్‌లు.. ఎక్కడో తెలుసా?

దిశ, ఫీచర్స్ : మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిపై వేధింపులు, దాడులు తగ్గడం లేదు. ముఖ్యంగా పని ప్రదేశాలు, ఆఫీసులకు వెళ్తున్న క్రమంలో రద్దీగా ఉండే బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నట్లు పోలీస్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా ప్యాసింజర్ల కోసం బస్టాండ్ల వద్ద లాంజ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC).. తద్వారా మహిళలకు భద్రత కల్పించాలని భావిస్తోంది. ఇప్పటికే […]

Update: 2021-03-15 03:39 GMT

దిశ, ఫీచర్స్ : మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిపై వేధింపులు, దాడులు తగ్గడం లేదు. ముఖ్యంగా పని ప్రదేశాలు, ఆఫీసులకు వెళ్తున్న క్రమంలో రద్దీగా ఉండే బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నట్లు పోలీస్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా ప్యాసింజర్ల కోసం బస్టాండ్ల వద్ద లాంజ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC).. తద్వారా మహిళలకు భద్రత కల్పించాలని భావిస్తోంది.

ఇప్పటికే మేజెస్టిక్, శాంతినగర్, కోరమంగళ బస్‌స్టేషన్లలో మహిళల కోసం లాంజ్‌లు ఏర్పాటు చేసిన బెంగళూరు కార్పొరేషన్.. మరో 4 స్టేషన్లు (బీటీఎం లేఅవుట్, జయనగర్, బసవేశ్వరనగర్, హోస్టోక్) కోసం టెండర్లు పిలిచింది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్భయ నిధులను ఉపయోగించనుంది. లాంజ్‌లో మహిళలు సేఫ్ అండ్ కంఫర్ట్‌గా ఫీలయ్యేందుకు టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, సీటింగ్ ఫెసిలిటీస్, చార్జింగ్ పాయింట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ బోర్డులతో పాటు బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళా సిబ్బంది మాత్రమే ఉండే ఈ లాంజెస్‌లో మహిళల్లో కొద్ది సేపు రెస్ట్ తీసుకోవచ్చు.

ఇదేగాక, దుర్గ(Dare to Understand behaviour, Respond appropriately and Guard Ourselves Ably) అనే ఎన్జీఓ సహకారంతో బీఎంటీసీ ఇటీవల ‘బాక్స్-ఇట్(Box-it)’ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా బెంగళూరు సిటీలోని 75 బస్టాండ్‌ల వద్ద ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. మహిళలు తమను వేధింపులకు గురిచేస్తున్న వారి పేర్లతో పాటు సేఫ్టీ ఇష్యూస్ గురించి రాసి ఈ బాక్స్‌లో వేయొచ్చు. నెలలో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి వాటిని ఫిర్యాదుగా తీసుకుంటారు. బెంగళూరు కార్పొరేషన్, సిటీ పోలీస్.. ఈ కంప్లయింట్స్ పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారు. ఇక బీఎంటీసీ స్టాఫ్ కోసం ప్రత్యేకంగా 21 రోజుల జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ (లింగ సాధికారిత) కండక్ట్ చేసి, వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు దుర్గ ఎన్జీఓ సంస్థ ప్రతినిధి వరదరాజన్ వెల్లడించారు.

Tags:    

Similar News