చౌటుప్పల్‌లో రక్తపు చుక్కల కలకలం
దిశ, నల్లగొండ: శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక సమాజంలోనూ మూఢ నమ్మకాల జాడ్యం గ్రామీణ ప్రాంతాలను వీడడంలేదు. చేతబడులు, బాణామతులంటూ పూజలు, బలుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి 5వ వార్డులో ఇంటింటికీ రక్తపు మరకలు చల్లి వెళ్లారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో ఉన్న 100 నివాసాల ముందు రక్తాన్ని […]
దిశ, నల్లగొండ: శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక సమాజంలోనూ మూఢ నమ్మకాల జాడ్యం గ్రామీణ ప్రాంతాలను వీడడంలేదు. చేతబడులు, బాణామతులంటూ పూజలు, బలుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి 5వ వార్డులో ఇంటింటికీ రక్తపు మరకలు చల్లి వెళ్లారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో ఉన్న 100 నివాసాల ముందు రక్తాన్ని చల్లారు. గ్రామశివారులో ఉన్న పెద్దిగారి యాదయ్య ఇంటి నుంచి మొదలుకొని ప్రతి గడప ముందు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం రక్తపు మరకలను గమనించిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు సమాచారం తెలియజేయడంతో వారు పరిశీలించారు. వారం రోజుల క్రితం కూడా ఇదే తరహాలో రక్తపు చుక్కలు ఇళ్లముందు కనిపించాయని గ్రామస్తులు తెలిపారు.
Tags: blood dots, Kattupalli, house, nalgonda, ts news