ఫ్రిజ్‌లో 6అడుగుల నల్లతాచు.. పడగ విప్పి బుసలు కొట్టడంతో
దిశ, ఏపీ బ్యూరో: ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలు తీసుకునేందుకు మహిళ డోరు తీసింది. అంతే ఫ్రిజ్‌లో నుంచి బుసలు కొడుతున్న తాచుపాము ప్రత్యక్షమవ్వడంతో ఆమె డోరు వేయకుండానే భయంతో పరుగులు తీసింది. ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించినా అది దొరక్కపోవడంతో ఇంట్లోవారు స్థానికులు భయంతో హడలిపోయారు. స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ ఈ పామును పట్టి సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో చోటు చేసుకుంది. పితాని […]
దిశ, ఏపీ బ్యూరో: ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలు తీసుకునేందుకు మహిళ డోరు తీసింది. అంతే ఫ్రిజ్‌లో నుంచి బుసలు కొడుతున్న తాచుపాము ప్రత్యక్షమవ్వడంతో ఆమె డోరు వేయకుండానే భయంతో పరుగులు తీసింది. ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించినా అది దొరక్కపోవడంతో ఇంట్లోవారు స్థానికులు భయంతో హడలిపోయారు. స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ ఈ పామును పట్టి సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో చోటు చేసుకుంది. పితాని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్‌లో 6 అడుగుల నల్లతాచు కలకలం రేపింది.
ఇంట్లోని మహిళ ఫ్రిజ్‌లో సరుకులు తీసుకునేందుకు డోరు తియ్యగా నల్లతాచు పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఫ్రిజ్‌లో దాకున్న పామును చూసి భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో నాగరాజు ఇంటికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సుమారు గంట పాటు శ్రమపడి పామును బయటకు తీశారు. అనంతరం దానిని సంచిలో బంధించాడు. జనావాసాలకు దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వేయడంతో కుటుంబ సభ్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గట్లు, పుట్టల్లో దాగివున్న పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ వారికి తెలిపారు.