ఫిమేల్ సెలెబ్రిటీస్ బ్లాక్ అండ్ వైట్ చాలెంజ్

‘ఉమెన్ ఇన్‌స్పైరింగ్ ఉమెన్, ఉమెన్ ఎంపవర్‌మెంట్’ హాష్ టాగ్స్‌తో సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ చాలెంజ్ వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా.. హీరోయిన్లు, మహిళా సెలెబ్రిటీలందరూ ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తూ.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఉపాసన కొణిదెల, సమంత అక్కినేని, రకుల్ ప్రీత్, లక్ష్మీ ప్రసన్న, అనుపమ, అనన్య పాండే, శిల్పా శెట్టి, బిపాసా బసు, కృతి సనన్, పార్వతి, కళ్యాణి ప్రియదర్శన్, […]

Update: 2020-07-27 05:08 GMT

‘ఉమెన్ ఇన్‌స్పైరింగ్ ఉమెన్, ఉమెన్ ఎంపవర్‌మెంట్’ హాష్ టాగ్స్‌తో సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ చాలెంజ్ వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా.. హీరోయిన్లు, మహిళా సెలెబ్రిటీలందరూ ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తూ.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఉపాసన కొణిదెల, సమంత అక్కినేని, రకుల్ ప్రీత్, లక్ష్మీ ప్రసన్న, అనుపమ, అనన్య పాండే, శిల్పా శెట్టి, బిపాసా బసు, కృతి సనన్, పార్వతి, కళ్యాణి ప్రియదర్శన్, లావణ్య త్రిపాఠి, శృతి హాసన్, సారా అలీ ఖాన్, మంజిమా మోహన్ ప్రతీ ఒక్కరు చాలెంజ్ స్వీకరించి ఫొటోస్ అప్‌లోడ్ చేయగా.. కలర్‌ఫుల్ సోషల్ మీడియా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది.

https://www.instagram.com/p/CDIlblhh478/?igshid=17fgrbmf20elo

https://www.instagram.com/p/CDI59-ap9uF/?igshid=1saknxbrcy8a

కరోనా లాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు కిందకు లాగే ప్రయత్నం చేయకుండా ఒకరికొకరం సాయం చేసుకుంటూ.. పైకి ఎత్తాలని చాటి చెప్పడమే ఈ చాలెంజ్ ఉద్దేశ్యం కాగా.. రేపు ఏం జరగబోతుందో, అసలు ఉంటామో ఉండమో? కూడా తెలియని పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఈరోజును ఉపయోగించుకుంటూ.. ఇతరులకు భరోసానిచ్చేలా ఉండాలని పిలుపునిస్తున్నారు ఫిమేల్ సెలెబ్రిటీస్. అందరం కలిసి ఒక బలగంగా మారి.. ప్రతీ రోజును ఉత్తమంగా మలచుకునే ప్రయత్నం చేద్దామని సూచిస్తున్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో మన మహిళా తెగను రక్షించుకునేందుకు ట్రై చేద్దాం అంటున్న మహిళా ప్రముఖులు.. ఒకవేళ సక్సెస్ కాకపోయినా సరే, ప్రయత్నించిన వారికి అభినందనలు తెలపాలని అంటున్నారు. ఒకరిని ఒకరం పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దామని.. తక్కువ చేసుకోకూడదని సూచిస్తున్నారు.

https://www.instagram.com/p/CDIwHsUJmRn/?igshid=12nkr1yq55tmd

https://www.instagram.com/p/CDIsjTEpxq3/?igshid=wau6yoczitf1

Tags:    

Similar News