‘బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయి’

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుముతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆ పార్టీ నేత విద్యాసాగర్ రావు గతంలో కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు సాయుధ పోరాట యోధులకు పింఛను ఇవ్వాలని నినదించారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు విమోచనా దినోత్సవానికి మతం రంగును పులుముతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు మాట […]

Update: 2021-09-08 11:56 GMT
‘బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయి’
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుముతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆ పార్టీ నేత విద్యాసాగర్ రావు గతంలో కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు సాయుధ పోరాట యోధులకు పింఛను ఇవ్వాలని నినదించారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు విమోచనా దినోత్సవానికి మతం రంగును పులుముతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. ఈ రెండు పార్టీల నేతలకు నార్కొటిక్ టెస్టులు చేయించాలన్నారు. విమోచన దినోత్సవాన్ని జరపడం ఈ రెండు పార్టీలకూ ఇష్టం లేదన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో నారాయణ పై వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట తీరులో ప్రవర్తిస్తున్నాయన్నారు.

బీజేపీ-టీఆర్ఎస్ డబుల్ గేమ్ : చాడ వెంకటరెడ్డి

రాజకీయంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నవారికి కేసీఆర్ ప్రభుత్వం పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీతో దోస్తీ కారణంగానే సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంగా టీఆర్ఎస్ నిర్వహించడంలేదన్నారు. మరోవైపు బీజేపీ దీనికి మతంరంగు పులుముతున్నదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలే లేరని, ప్రజా దగా యాత్ర అని వ్యాఖ్యానించారు. ఆయన యాత్రను ప్రజలు గుర్తించడంలేదన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాతనే అమిత్ షా తెలంగాణలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ తరహాలో వ్యవహరిస్తున్నాయన్నారు.

Tags:    

Similar News