120 రోజుల పాటు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన..

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. వచ్చే నెలలో యాత్ర మొదలుపెట్టి 120 రోజుల పాటు సాగించనున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఆయన పర్యటన డిసెంబర్ 5న ప్రారంభం కానున్నట్టు సమాచారం. పెద్ద రాష్ట్రాల్లో 3 రోజులు , చిన్న రాష్ట్రాల్లో 2 రోజుల చొప్పున ఆయన పర్యటన కొనసాగనుంది. ప్రతిరాష్ట్రంలో పర్యటించి బూత్ లెవల్ సారథులతో వర్చువల్ మీటింగులు, పార్టీ సీనియర్ నేతలతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలనూ కలవనున్నారు. […]

Update: 2020-11-22 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. వచ్చే నెలలో యాత్ర మొదలుపెట్టి 120 రోజుల పాటు సాగించనున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఆయన పర్యటన డిసెంబర్ 5న ప్రారంభం కానున్నట్టు సమాచారం. పెద్ద రాష్ట్రాల్లో 3 రోజులు , చిన్న రాష్ట్రాల్లో 2 రోజుల చొప్పున ఆయన పర్యటన కొనసాగనుంది. ప్రతిరాష్ట్రంలో పర్యటించి బూత్ లెవల్ సారథులతో వర్చువల్ మీటింగులు, పార్టీ సీనియర్ నేతలతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలనూ కలవనున్నారు.

నేరుగా క్షేత్రస్థాయి కార్యకర్తలతోనూ మాట్లాడే అవకాశమున్నది. వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రధాన్యత ఏర్పడింది. వీటితోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ మరింత దూసుకెళ్లె లక్ష్యంతో ఈ యాత్ర సాగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి, కార్యకర్తల్లో హుషారు నింపడానికి నడ్డా కసరత్తు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టనున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇలాగే దేశవ్యాప్త పర్యటనలు చేసి పార్టీని బలోపేతం చేశారని నిపుణులు చెబుతుంటారు. బీజేపీ వెనుకబడిన రాష్ట్రాల్లోనూ పుంజుకోవడానికి దోహదపడ్డారని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News