దళిత, మైనార్టీల వ్యతిరేకి బీజేపీ..

బీజేపీ పార్టీ దళిత, మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరనిస్తుందని ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిని వెనక్కి నెట్టేలా బీజేపీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.వాల్మీకి వర్గానికి చెందిన దళితులు దేశ ప్రజలు కాదని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు.బీజేపీ న్యాయవాదుల వాదనతోనే సుప్రీంలో ఇలాంటి తీర్పు వచ్చిందని మండిపడ్డారు.70ఏండ్లుగా కాంగ్రెస్ దేశంలో సమన్యాయం కోసం పని చేస్తోందని గుర్తుచేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును కాంగ్రెస్ […]

Update: 2020-02-18 04:44 GMT

బీజేపీ పార్టీ దళిత, మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరనిస్తుందని ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

దేశాభివృద్ధిని వెనక్కి నెట్టేలా బీజేపీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.వాల్మీకి వర్గానికి చెందిన దళితులు దేశ ప్రజలు కాదని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు.బీజేపీ న్యాయవాదుల వాదనతోనే సుప్రీంలో ఇలాంటి తీర్పు వచ్చిందని మండిపడ్డారు.70ఏండ్లుగా కాంగ్రెస్ దేశంలో సమన్యాయం కోసం పని చేస్తోందని గుర్తుచేశారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును కాంగ్రెస్ అన్నివేళలా వ్యతిరేకిస్తోందని,దీనిపై ఉభయసభల్లో మరోసారి చర్చ జరగాలన్నారు.ఎంఐఎం లాంటి పార్టీలు వార్తల్లో నిలిచేందుకు కొన్నిస్టేట్ మెంట్స్ చేస్తాయే తప్ప వాస్తవాలు మాట్లడవని, ఆ పార్టీ మూసినది లాంటిదని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎంఐఎం ఎవరి కనుసన్నల్లో పని చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారని ఎంపీ నాసిర్ వివరించారు.

Tags:    

Similar News